భారీ వర్షం...ఆ గ్రామాలకు రాకపోకలు బంద్​

బెజ్జూర్ మండలం సుస్మిర్ ఒర్రె ఉప్పొంగింది. దాంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Update: 2024-08-24 09:44 GMT

దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మండలం సుస్మిర్ ఒర్రె ఉప్పొంగింది. దాంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సుస్మిర్ ఒర్రె పొంగిపొర్లడంతో బెజ్జూర్ మండలంలోని సోమినీ , మూగవెల్లి, సుస్మీర్, ఇప్పలగూడెం, గిర్రెగూడెం, పాత సోమిణి తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

     వర్షం పడిందంటే ఈ ఒర్రె తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బెజ్జూర్ మండల కేంద్రానికి చేరుకోవడానికి ఈ ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బెజ్జూర్ కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో గల సుస్మీ రు, సోమేని గ్రామాల మధ్య గల రోడ్డుపై వంతెన లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సుస్మీర్ ఒర్రె పై వంతెన నిర్మించాలని మండల వాసులు కోరుతున్నారు. 

Tags:    

Similar News