నిర్మల్ లో భారీగా మత్తు పదార్థాలు పట్టివేత

పది గ్రాముల అల్పోజోలంతో వంద పెట్టెల కల్తీ కల్లు తయారు చేయచ్చు. ఒక కిలో అల్పోజోలం ధర పైసా రెండు పైసలు కాదు

Update: 2024-10-03 15:52 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్ : పది గ్రాముల అల్పోజోలంతో వంద పెట్టెల కల్తీ కల్లు తయారు చేయచ్చు. ఒక కిలో అల్పోజోలం ధర పైసా రెండు పైసలు కాదు... ఏకంగా ఖరీదు రూ. 10 లక్షలపైనే ఉంటుంది. అలాంటి అత్యంత ఖరీదైన మతపదార్థాలను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం ఎక్సైజ్ అధికారులు అందించిన వివరాల ప్రకారం... దశాబ్ద కాలంగా నిర్మల్‌కు చెందిన గంధం శ్రీనివాస్‌ గౌడ్‌ అనే వ్యక్తి రాజస్థాన్‌, సోలాపూర్‌ ప్రాంతాల నుంచి రూ. లక్షల పెట్టుబ డిగా పెట్టి రూ. కోట్లు గడించే ప్రయత్నంలో ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ పోలీసులకు పట్టుబ డ్డాడు. రూ. 43 లక్షల విలువ చేసే ఆల్పోజోలం, క్లోరో హైడ్రేట్‌తో ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కడం నిర్మల్‌లో సంచలనం రేపింది.

అక్రమంగా తరలించి... గుట్టు చప్పుడు కాకుండా...

ప్రభుత్వం నిషేదించిన, ఎన్‌డీపీఎస్‌లో చేర్చబడిన ఆల్పోజోలం, క్లోరో హైడ్రేడ్‌లను అక్రమ మార్గాల గుండా రాజస్థాన్‌, సోలాపూర్‌ నుంచి తక్కువ ధరలకు తెప్పించి వివిధ ప్రాంతాల్లోని కల్తీ కల్లు తయారీదారులకు అమ్మకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్న గంధం శ్రీనివాస్‌ గౌడ్‌ కు కొన్నేళ్ల నుంచి నేర చరిత్ర ఉందని అధికారులు తెలిపారు. 2016 నుంచి 2024 వరకు వివిధ ప్రాంతాల్లో ఎనిమిది కేసులు శ్రీనివాస్‌ గౌడ్‌పై నమోదు చేశారు. చివరకు పీడీ యాక్ట్‌ కూడ పెట్టారు. అయినా చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని వదులుకోలేక మరోసారి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ టీం లీడర్‌ ప్రదీప్‌రావుకు ఆల్పోజోలం, క్లోరో హైడ్రేడ్‌తో పట్టుబడ్డాడు.

నిర్మల్‌లోని ద్వారాకనగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట్లో 3.3 కిలోల అల్పోజలం స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు కల్తీ తయారు కు ఆల్పోజోలంతోపాటు క్లోరో హైడ్రేడ్‌ వాడుతారని, శ్రీనివాస్‌ గౌడ్‌ను క్లోరో హైడ్రేడ్‌ కోసం విచారించగా శాంతినగర్‌లోని గోదాంలో ఉందని సమాచారం ఇచ్చాడు. గోదం తెరిచి చూస్తే అందులో 720 కిలోల క్లోరో హైడ్రేడ్‌ లభించింది. నిందితుడిని విచారించగా సోలాపూర్‌ రూప్‌సింగ్‌ నుంచి అల్పోజోలం, రాజస్థాన్‌లోని శ్రీను అలియాస్‌ బాయి అనే వ్యక్తి నుంచి క్లోరో హైడ్రేడ్‌ను తెప్పిస్తున్నట్లు శ్రీనివాస్‌ అంగీకరించాడు. ఈ ఇద్దరిపై కూడ కేసు నమోదు చేసినట్లు ప్రదీప్‌రావు తెలిపారు. ఆల్పోజోలం, క్లోరో హైడ్రేడ్‌ను పట్టుకున్న ఎస్ టి ఎఫ్ పోలీసులను ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విబి కమలాసర్‌రెడ్డి అభినందించారు.


Similar News