తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు..

వ్యవసాయ సంఘం ముసుగులో డబ్బుల కోసం ఎరువులు విత్తనాల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులను వేధింపులకు గురిచేయడం తగదని లోకేశ్వరం మండలంలోని ఎరువులు విత్తనాల డీలర్ల అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-02-21 11:53 GMT

దిశ, లోకేశ్వరం : వ్యవసాయ సంఘం ముసుగులో డబ్బుల కోసం ఎరువులు విత్తనాల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులను వేధింపులకు గురిచేయడం తగదని లోకేశ్వరం మండలంలోని ఎరువులు విత్తనాల డీలర్ల అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వారు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. గైని మురళిమోహన్ అనే వ్యక్తి వ్యవసాయ సంఘం పేరు చెప్పుకొని డీలర్లు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని, వ్యవసాయశాఖ అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని పేర్కొంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వివిధ కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తూ, నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ ఇవ్వని వారిపై తప్పుడు ఆరోపణలుచేస్తే న్యాయబద్ధంగా ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతూ రైతు సేవలో ముందుంటున్న లోకేశ్వరం మండలంలోని డీలర్లను, అధికారులను వ్యవసాయ సంఘం పేరుతో వేధించడం మానుకోవాలని అన్నారు. మండలంలోని రైతులు ఎవరు ఫిర్యాదు చేయకున్నా కూలీలను వెంటబెట్టుకొని తరచూ వివిధ కార్యాలయాలకు వెళ్లడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల డీలర్స్ అసోసియేషన్ సభ్యులు విజయ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అనిల్, సుధీర్ రెడ్డి, నర్సారెడ్డి, నారాయణ, శ్రీనివాస్, గోపి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News