అన్ని వర్గాల అభ్యున్నతికి సర్కారు కృషి

ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ పథకాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

Update: 2024-11-21 16:14 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్ : ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ పథకాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సంబరాలు పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఆహ్లాదకర వాతావరణంలో సాగిన కళాయాత్ర  ప్రదర్శనలో అంతడుపుల నాగరాజు బృందం ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ, ప్రభుత్వ సంక్షేమ పాలనను ఆవిష్కృరింపజేశారు.

    ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్, గ్రంథాలయ, మార్కెట్ కమిటీల చైర్మన్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీయువకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కళాకారుల ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు పరుస్తుందని తెలియజేస్తూ జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును కలెక్టర్ వివరించారు.

     జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన కళాకారుల బృందాలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇన్చార్జి డీఆర్ఓ రత్న కళ్యాణి, డీపీఆర్ఓ ఇ.విష్ణువర్ధన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలి, నిర్మల్,  ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, రాజుర సత్యం, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


Similar News