పీఎం జన్ మన్ పథకంతో ఆదివాసీలు అభివృద్ధి

దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్ యోజన) పథకం ప్రవేశ పెట్టిందని, దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ నగేష్,ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు.

Update: 2024-11-21 11:17 GMT

దిశ, ఆదిలాబాద్ : దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్ యోజన) పథకం ప్రవేశ పెట్టిందని, దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ నగేష్,ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలైన పొతూగూడ, మొలల గుట్టలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఎం జన్ మన్ యోజన పథకం ఆదివాసీ, గిరిజన గ్రామాలకు వరంగా అభివర్ణించారు.

    ఈ పథకం ప్రవేశ పెట్టిన మోడీకి మనమందరం రుణపడి ఉన్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా మరో ఐదేళ్లలో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో నెట్ వర్క్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ప్రధాన మంత్రులు పనిచేశారని, ఏ ఒక్క పార్టీ గిరిజనులు, వారి సంక్షేమం కోసం పాటుపడలేదన్నారు. పార్టీలకతీతంగా జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలను ఎంపిక చేసి, ఆ గ్రామంలో మంచినీటి వసతి, రోడ్డు సౌకర్యం, విద్య, వైద్య ఆరోగ్య స్థితులను మెరుగుపరచడమే ధ్యేయంగా నేరుగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంతోష్, దయాకర్, సుభాష్, అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Similar News