మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
దిశ, సారంగాపూర్ : ప్రభుత్వం తీసుకుంటున్న చర్యతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని తెలిపారు.
కుల వృత్తులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. ఇందులో భాగంగా చేప పిల్లలను చెరువులో వదిలామని తెలిపారు. చేపలను రోజు వారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపతోందని వైద్యులు సూచిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్ల వెంకటరామిరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, అడెల్లి టెంపుల్ చైర్మన్ ఐటీ చందు, ఏఎంసీ చైర్మన్ ఆశ్రిత శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ మాధవరావు, స్థానిక సర్పంచ్ అయోష సిద్ధికి, ఎక్స్ ఏఎంసీ రాజ్ మహమ్మద్, ఇరిగేషన్ అధికారులు, గంగపుత్రులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.