ఎన్నికలు సజావుగా సాగేందుకు పూర్తి సహకారం

మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తమ పూర్తి సహకారం అందిస్తామని రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-10-24 16:23 GMT

దిశ, ఆసిఫాబాద్ :  మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తమ పూర్తి సహకారం అందిస్తామని రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మహారాష్ట్ర,తెలంగాణ, ఛతీష్ ఘడ్ మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతిష్ట నిఘా పెట్టి, మూడు రాష్ట్రల పోలీసులు పరస్పర సహకరించుకుంటూ ఎన్నికలు సాఫీగా సాగేలా చూడాలని అన్నారు.

తెలంగాణ తో పాటు ఇతర సరిహద్దులో ఉన్న సమస్యాత్మకమైన గ్రామల పై ప్రత్యేక దృష్టి సారించడం తో పాటు మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలని, అసెంబ్లీ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో గడ్చిరోలి డీఐజీ అంకిత్ గోయల్, కన్కెర్ ఎస్పి కళ్యాణ్ ఎలేసెల, మొహాల మన్సూర్ ఎస్పీ, వై.పి సింగ్. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్, చంద్రపూర్ ఎస్పీ సుదర్శన్, ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, రాబిన్సన్ గురియా అడిషనల్ ఎస్పీ నారాయణపూర్, దినేష్ సింహ అడిషనల్ ఎస్పీ బీజాపూర్, ఏ భాస్కర్ డీసీపీ మంచిర్యాల, ఎం రమేష్ ఎడిషన్ ఎస్పీ అడ్మిన్ గడ్చిరోలి, వీ రాఘవేంద్రరావు ఏసిపి స్పెషల్ బ్రాంచ్ రామగుండం తదితరులున్నారు.


Similar News