రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఆలూరు గ్రామంలో పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Update: 2023-04-26 12:38 GMT

దిశ, సారంగాపూర్: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఆలూరు గ్రామంలో పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశామన్నారు. రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, స్వర్ణ వాగుపై చెక్ డ్యాం నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మొదటి రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.2,060/-, రెండో రకానికి రూ.2,040/- ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, సొసైటీ చైర్మెన్ లు నారాయణ రెడ్డి, మాణిక్ రెడ్డి, అడెల్లి పోచమ్మ ఛైర్మన్ చందు, ఏఎంసీ చైర్మన్ ఆశ్రిత శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఎంపీపీ పథానీ రాధ, గ్రామ సర్పంచ్ దండు రాధ, మండల బీఆర్ఎస్ కన్వీనర్ మాధవ్ రావు, ఆయ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News