BJP: కాంగ్రెస్ పాలనలో విద్యార్థులపై పెరిగిన దాడులు.. ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ పాలన(Congress Rule)లో విద్యార్థులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే(Adilabad BJP MLA) పాయల్ శంకర్( Payal Shankar) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పాలన(Congress Rule)లో విద్యార్థులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే(Adilabad BJP MLA) పాయల్ శంకర్( Payal Shankar) అన్నారు. బాసర ఘటన(Basara Incident)పై స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా.. బాసరలో త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై న్యాయవిచారణ జరగాలని కోరుతూ ఏబీవీపీ విద్యార్ధి సంఘాల నాయకులు(ABVP Student Union leaders), విద్యార్థులు(Students) కాలేజీ వద్దకు వెళ్లారని తెలిపారు.
ఓ పోలీస్ అధికారి కాలేజీ ప్రైవేట్ సెక్యూరిటీతో కలిసి విద్యార్థులపై దాడి చేయడమే గాక దారుణంగా చిత్రహింసలకు గురి చేసినట్లు వీడియోల్లో కనిపించిందన్నారు. దీనిపై రాష్ట్ర డీజీపీ(Telangana DGP) సమాధానం చెప్పాలన్నారు. అంతేగాక విద్యార్థి ఆత్మహత్యపై సమాధానం చెప్పలేకపోతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు. ఇక విద్యార్థులపై దాడి చేయడం విచారకరమని, దాడికి పాల్పడ్డ సీఐని సస్పెండ్ చేయాలని కోరారు. అలాగే ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.