కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ముధోల్ ఎమ్మెల్యే

భైంసా, కుబీర్ సోయా కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని

Update: 2024-10-05 11:00 GMT

దిశ,భైంసా : భైంసా, కుబీర్ సోయా కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.శనివారం బైంసా మండలంలోని మాటేగాం గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కుబీర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నందు సొయా కొనుగోళ్ల ను ప్రారంభించిన సందర్భంగా హాజరయ్యి మాట్లాడారు.భైంసా మండలం లో 18 వేల ఎకరాల్లో కుబీర్ మండలంలో 17 వేల ఎకరాల్లో రైతులు సోయా పంటను సాగు చేశారని, మార్కెట్ లో ధర లేకపోవడంతోనే వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి కొనుగోలు ప్రారంభించినట్లు తెలిపారు.

క్వింటాకు రూ. 4892 మద్దతు ధర ఉందని, 12 శాతం తేమ తో తమ పంటను తీసుకువచ్చి అమ్మలన్నారు.ప్రభుత్వం ఎకరానికి కేవలం 6 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేయడంతో రైతులు సమస్యను తెలియజేయగా ఎకరానికి 10 క్వింటాళ్లు కొనుగోలు చేసే విధంగా చూస్తానన్నారు.కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ గంగా చరణ్, వైస్ చైర్మన్ చాకేటి లస్మన్న,పీఎసీఎస్ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ ఏడీఏ వీణ,తదితరులు పాల్గొన్నారు.


Similar News