బాలకార్మికుల నిర్మూలనకు కృషి చేయాలి.. : అదనపు ఎస్పీ

బాలకార్మికుల నిర్మూలనకు అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని

Update: 2024-07-01 11:46 GMT

దిశ,ఆసిఫాబాద్ : బాలకార్మికుల నిర్మూలనకు అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ 10 పై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాలకార్మికుల నిర్మూలన కోసం రెండు అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలీస్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులతో కలిసి రెండు ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ టీంలు జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు విధిగా మెకానిక్ షాప్,హోటల్, కిరాణా షాపుల్లో తనిఖీలు చేసి,బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని,అదే సమయంలో బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News