ట్రైనింగ్‌లో క్రమశిక్షణ తప్పనిసరి : జిల్లా ఎస్పీ

పోలీసు ఉద్యోగంలో రాణించాలంటే ట్రైనింగ్ లో క్రమశిక్షణ ఎంతో

Update: 2024-04-03 13:36 GMT

దిశ,ఆదిలాబాద్ : పోలీసు ఉద్యోగంలో రాణించాలంటే ట్రైనింగ్ లో క్రమశిక్షణ ఎంతో అవసరమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం శిక్షణ కానిస్టేబుల్ లకు సూచించారు. మంగళవారం స్థానిక ఆదిలాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న 6 జిల్లాల నుండి ఆదిలాబాద్ జిల్లా శిక్షణ కేంద్రానికి వచ్చిన 255 మంది శిక్షణ కానిస్టేబుళ్లతో బుధవారం పరిచయ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పాల్గొన్నారు.ఈ సందర్భంగా శిక్షణ స్వీకరిస్తున్న స్టైఫండరి కానిస్టేబుల్ లను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని శిక్షణ కేంద్రాల్లో ఒకే రకమైన శిక్షణ అందిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ద్వారా అత్యంత ఉన్నతమైన సౌకర్యాలను కల్పిస్తూ శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపారు. 9 నెలల పాటు జరిగే ఈ శిక్షణలో ఇండోర్ అవుట్డోర్ విభాగాలను శిక్షణను అందిస్తారని,శిక్షణలో భాగంగా ఫిజికల్ ట్రైనింగ్, స్వాడ్ డ్రిల్, ఆమ్స్ డ్రిల్, లాటి డ్రిల్, వెపన్ ట్రైనింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, ఫైరింగ్ ప్రాక్టీస్, యోగ, అదేవిధంగా సీఆర్పీసీ, ఐపీసీ, ఇన్వెస్టిగేషన్, నేరస్తులు ఉపయోగిస్తున్న నూతన పద్ధతులను నేర్పిస్తారని అన్నారు.

సమాజంలో పోలీసులకు ఉన్నత స్థానం కలిగి ఉందని,దాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని, ఉద్యోగం నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ తప్పనిసరి అని సూచించారు. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుల్ లకు 13,500/- రూపాయలు స్టయిఫండ్ ను అందిస్తున్నట్లు తెలియజేశారు. పోలీసు ఉద్యోగం అనేది ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమని తెలియజేశారు. అదేవిధంగా శిక్షణ సమయంలో ఏకాగ్రతతో ఉంటూ ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం సమాజంలో నేరాలను తగ్గుముఖం చేయడమే ప్రధాన కర్తవ్యం గా విధుల నిర్వర్తించాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు, ఆర్థిక నేరగాళ్లు, సంఘవిద్రోహ శక్తులు, వివిధ రకాలైన నేరగాలతో ఉద్యోగం నిర్వహించవలసి వస్తుందని దీనికి దీటుగా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సి సమైజాన్ రావు, డీఎస్పీ బి ప్రకాష్, సీఐ ఎన్ ఎస్ ప్రసాద్ , ఆర్ఐ డి కార్తీక్, ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News