దారి మార్చిన ఎడారి బాటసారి..
ఒంటెలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజస్థాన్ ప్రాంతం. వీటి మనుగడ అక్కడే ఉంటుంది.
దిశ, తలమడుగు : ఒంటెలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజస్థాన్ ప్రాంతం. వీటి మనుగడ అక్కడే ఉంటుంది. కానీ కాల క్రమేణా ఒంటెలు వాటి ప్రాంతం అయిన రాజస్థాన్ ను విడిచి పెట్టి వేరే ప్రాంతాలకు వస్తున్నాయి. తలమడుగు మండలంలో ఒంటెలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన పిల్లలు, పెద్దలు వాటినే చూస్తూ ఉండిపోయారు. దిశ న్యూస్ వారిని పలకరించగా బ్రతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకొని రాజస్థాన్ నుండి వేరే ప్రాంతాలకు బయలు దేరామని, ఇక్కడ పచ్చి గడ్డి, నీళ్లు పుష్కలంగా ఉండడంతో ఇక్కడకు వచ్చామని దిశ న్యూస్ తో తెలిపారు.