'లగచర్ల రైతులకి న్యాయం చేయాలి..'

మందమర్రిలోని స్థానిక కోల్ బెల్ట్ రహదారి అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపు మేరకు చెన్నూర్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షుడు జె.రవీందర్ టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మెడిపెల్లి సంపత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చారు.

Update: 2024-12-18 04:46 GMT

దిశ, మందమర్రి : మందమర్రిలోని స్థానిక కోల్ బెల్ట్ రహదారి అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపు మేరకు చెన్నూర్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షుడు జె.రవీందర్ టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మెడిపెల్లి సంపత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజారమేష్ మాట్లాడుతూ లగచర్ల రైతుల పై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నల పై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు యూత్ విద్యార్థి సోషల్ మీడియా మహిళా నాయకురాలు పాల్గొన్నారు.


Similar News