బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధం.. వాటిపై ఆజ్ఞలు పొడిగింపు..

Update: 2022-02-01 07:46 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల,  పెద్దపల్లి జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి  ఐపీఎస్(ఐజి) ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం,  అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, మద్యం ప్రియుల ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటు ప్రజల భద్రత, రక్షణ కోసం నిషేధాజ్ఞలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 01-02-2022 నుండి 28-02-2022 వరకు కొనసాగుతాయని తెలిపారు.  పరిస్థితుల ప్రభావం దృష్ట్యా  ఈ కాల పరిమితి పొడిగించబడే  అవకాశం ఉందని అన్నారు. ఐపీసీ,188,  హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి  హెచ్చరించారు.

 రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల,  పెద్దపల్లి జోన్‌లలో డీజే సౌండ్ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడగించామని  తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి  భంగం కలగకుండా,  శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే సౌండ్ల్ వినియోగిస్తున్నారని, అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్  వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసీపీల అనుమతి పొందాలని సూచించారు.

ఏయే ప్రాంతాల్లో ఏ స్థాయిలో మైక్ సెట్ వినియోగించాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు 01-02-2022 నుండి 28-02-2022 వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావంతో ఈ కాల పరిమితి పొడిగించబడే  అవకాశం ఉందని అన్నారు. ఐపీసీ 188 హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి  హెచ్చరించారు.

Tags:    

Similar News