Collector Kumar Deepak : నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్

Update: 2024-08-28 09:15 GMT

దిశ, చెన్నూర్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు.మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డెంగ్యూ జ్వరాలు విజృంభణపై ఆసుపత్రిలోని వైద్యులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం రోగులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు.రోగులకు మెరుగైన చికిత్స అందించే దిశగా విధుల్లో ఉన్న డాక్టర్లు పర్యవేక్షించాలని నర్సులతో చికిత్సలు అందిస్తూ వారు శ్రద్ధ వహించడం లేదని తన దృష్టికి వచ్చిందని, ప్రతి చిన్న విషయంలో మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తున్నారని డ్యూటీలో ఉన్న వైద్యులు శ్రద్ధ వహించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆసుపత్రి లో అపరిశుభ్రత పై నిర్లక్ష్యం వ్యవహరించవద్దని ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు.


Similar News