చెప్పులు, రాళ్లతో పొట్టు పొట్టు కొట్టుకున్న నాయకులు
కాగజ్ నగర్ పట్టణంలోని 90 వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
దిశ, కాగజ్నగర్ : కాగజ్ నగర్ పట్టణంలోని 90 వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. గురువారం ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, బీఎస్పీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి చెప్పులు, రాళ్లతో పరస్పర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కరీంనగర్ డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ ఎస్సై గంగన్న, కానిస్టేబుల్ రత్నాకర్ తో పాటు మరికొంతమంది పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి.
పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీఎస్పీ నాయకులు వాదించడంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగి తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను ఆపేందుకు ప్రయత్నించగా పోలీసులకు గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఇరువార్గాలను చెదరగొట్టారు.