గడపగడపకు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
జైపూర్ మండలంలో ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది.
దిశ, రామకృష్ణాపూర్ : జైపూర్ మండలంలో ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా, బాల్కసుమన్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ బుధవారం మండలంలోని ఎల్కంటి గ్రామంలో జడ్పీటీసీ మేడి సునీత తిరుపతి ప్రచారం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పోస్టర్లతో ప్రచారం ప్రారంభించారు. అభివృద్ధి చేస్తున్న పార్టీలకే పట్టం కట్టాలని, మోసపూరిత హామీలు ఇస్తూ ఇబ్బందులకు గురిచేసే పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వాతి, మాజీ ఉపసర్పంచ్ జనంపెళ్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.