ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

Update: 2024-08-21 10:05 GMT

దిశ, బెజ్జర్ : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం బెజ్జూరు మండలంలోని భారగూడెం, పోతే పెళ్లి, బెజ్జూరు గ్రామాల్లో పర్యటించారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి తుకారాం భట్ ను ఆదేశించారు. జిల్లాలో వైద్యుల కొరత ఉందని త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. బెజ్జూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కేంద్రంలోని రిజిస్టర్ను పరిశీలించారు. వ్యాధుల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రజలకు వైద్యం

    అందించాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ సెంటర్ లోని వార్డులను పరిశీలించారు. రోగులను వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మలేరియా డెంగ్యూ కేసులు ఉన్నాయని, ఒళ్లు నొప్పులతో పేషెంట్లు బాధపడుతున్నట్లు రికార్డులో చూసి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బెజ్జూర్ మండలంలోని భారగూడెం, పోతే పెళ్లి గ్రామాల్లోని రోడ్లను పరిశీలించారు. బెజ్జూరు ప్రత్యేక అధికారి ద్వారా గ్రామాల్లో రోడ్ల గుంతలను పూడ్చివేయాలని ఆదేశించారు. బెజ్జూర్ మండలంలోని బెజ్జూర్ శివారులోని 761, 762 సర్వే నెంబర్లలలో పట్టేదారు పాస్ బుక్ పుస్తకాలు

    లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వేలు చేసి పట్టాలు ఇవ్వాలని కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తహసీల్దార్ భుమేశ్వర్ ను సంయుక్త సర్వేలు నిర్వహించి పట్టాలు అందజేయాలని ఆదేశించారు. బెజ్జూర్ మండలంలో సహకార బ్యాంకులో రుణమాఫీలో గందరగోళం జరిగిందని ఫిర్యాదు చేశారు. సహకార బ్యాంక్ పై ప్రత్యేక దృష్టించాలని గ్రామస్తులు కోరారు. ఆయన వెంట కొమరం భీం ఆసిఫాబాద్ డీఎంహెచ్వో డాక్టర్ తుకారాం భట్, సీఈవో రాదండి లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేక అధికారి వెంకటేష్, ఎంపీడీవో గౌరీ శంకర్, డాక్టర్ అవినాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News