Bellampalli ACP : మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి

గ్రామాల్లో మాదకద్రవ్యాలను ఎవరైనా పీల్చిన, విక్రయించిన

Update: 2024-08-28 11:59 GMT

దిశ, తాండూర్ : గ్రామాల్లో మాదకద్రవ్యాలను ఎవరైనా పీల్చిన, విక్రయించిన పోలీసులకు సమాచారమిచ్చి, వాటి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. మాదకద్రవ్యాల వాడకం వలన కలిగే దుష్ప్రభావం, యాంటీ ర్యాగింగ్, కొత్త చట్టాలపై స్థానిక విద్యా భారతి పాఠశాల లో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఏసీపీ మాట్లాడుతూ.. గంజాయి మాదక ద్రవ్యాలు, సిగరెట్, గుట్కా, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు యువత ఆకర్షితులు కాకుండా దూరంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకొని తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా శ్రద్ధగా చదువుకుని మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎంఈఓ వాసాల ప్రభాకర్, ఎస్సై కిరణ్ కుమార్, విద్యా భారతి విద్యాసంస్థల కరస్పాండెంట్ సురభి శరత్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Similar News