నిండుకుండలా బాసర గోదావరి..

నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని

Update: 2024-07-02 08:56 GMT

దిశ,భైంసా : నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం త్రిసభ్య కమిటీ అధికారుల ఆధ్వర్యంలో ఎత్తారు. దీంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం సమీపంలో గల గోదావరి నది ఉప్పొంగి ప్రవహించగా నిండుకుండలా కనిపిస్తుంది.నిన్నటి వరకు అడుగంటి పోయిన గోదావరి జలాలు నూతనంగా బాబ్లీ వైపు నుండి బాసర గోదావరి వరద జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తూ పరవాళ్ళు తొక్కుతున్నాయి.


Similar News