గనుల ప్రైవేటీకరణ ఆపకపోతే మరో ఉద్యమం తప్పదు.. టీబీజీకేఎస్ నిరసన

సింగరేణి బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరించడానికి నిరసనగా టీబీజీకేఎస్

Update: 2024-07-01 13:19 GMT

దిశ,బెల్లంపల్లి : సింగరేణి బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరించడానికి నిరసనగా టీబీజీకేఎస్ నిరసన తెలిపింది. ఇవాళ శాంతి ఖని బొగ్గు బావి పై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపు మేరకు శాంతి ఖని గనిలో నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేసినట్లు టీబీజీకేఎస్ జాయింట్ సెక్రటరీ సిద్ధం శెట్టి సాజన్ తెలిపారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులు అన్ని కూడా సింగరేణి సంస్థకే ఎలాంటి షరతులు లేకుండా కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకులు వేలం వేస్తే సింగరేణికి భవిష్యత్తు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై కార్మిక లోకానికి అన్యాయం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం నిలిపి వేయకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా సింగరేణిని కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి కార్మిక లోకం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం గని మేనేజర్ కు ప్రైవేటీకరణ నిలిపి వేయాలని సింగరేణి సంస్థ వేలం పాటలో పాల్గొనకుండా ఉండాలని విన్నతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ CH. రమణ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రాజనాల రమేష్, శాంతి ఖని గని నాయకులు సూరం మల్లేష్, హనుమంతరావు, అశోక్, విజయ్, వెంకటేష్, సాయి, ఖాదర్, శ్రీకాంత్, మహేష్, రాకేష్, శ్రీనివాస్, భిక్షపతి, నసీరుద్దీన్, సందీప్, సాగర్,తదితరులు పాల్గొన్నారు.

Similar News