కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్
దృష్టిలోపం ఉన్న ప్రతి ఒక్కరూ కంటివెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా అన్నారు.
దిశ, గుడిహత్నూర్ : దృష్టిలోపం ఉన్న ప్రతి ఒక్కరూ కంటివెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ కంటి పరీక్షల కోసం వచ్చేవారిని పరీక్షించి అవసరమైన కళ్లద్దాలను ఇవ్వాలన్నారు.
శిబిరాల వద్ద ప్రజలు గుమిగూడి ఉండకుండా ఏ ప్రాంతం నుండి ఎంతమంది రావాలో అధికారులు ముందే ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. పరీక్షించిన వారి సమాచారాన్ని కంటి వెలుగు యాప్ లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీత, సర్పంచ్ సునీత జాదవ్, వైద్యాధికారి డాక్టర్ శ్యాం సుందర్, ఆప్టోమెట్రిస్ట్ రాథోడ్ శీల్పా, ఎంపీటీసీ అంకతి సవిత, ఉపసర్పంచ్ గజానంద్, పంచాయతీ సెక్రెటరీ రాందాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.