అక్రమంగా వరి ధాన్యంతో తరలిస్తున్న లారీ పట్టివేత..
అక్రమంగా ఓవర్ లోడ్ తో వరి ధాన్యం తరలిస్తున్న లారీని పక్కా సమాచారంతో బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు తాసిల్దార్ ప్రమోద్, ఆర్ఐ ఖలీల్ పట్టుకున్నారు.
దిశ, కాగజ్ నగర్ : అక్రమంగా ఓవర్ లోడ్ తో వరి ధాన్యం తరలిస్తున్న లారీని పక్కా సమాచారంతో బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు తాసిల్దార్ ప్రమోద్, ఆర్ఐ ఖలీల్ పట్టుకున్నారు. కౌటాల మండలం ముత్యంపేట నుండి తూర్పుగోదావరి జిల్లా మండపేట రైస్ మిల్లులకు వరి ధాన్యం తరలిస్తున్నారని భాజపా నాయకులు కలెక్టర్ కి సమాచారం అందించారు. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు తాసిల్దార్ వరి ధాన్యంతో ఉన్న లారిని పోలీస్ స్టేషన్ వద్ద నిలిపివేశారు. గురువారం జిల్లా సివిల్ సప్లై అధికారిని తారమని పోలీస్ స్టేషన్ కి చేరుకొని విచారణ చేపట్టారు. 600 బస్తాల ఓవర్ లోడ్ వరి ధాన్యంతో ఏపీ 27 టిఎక్స్ 3659 నెంబర్ గల లారీతో ఉన్నట్లు సమాచారాన్ని జిల్లా అధికారులకు నివేదిక పంపించి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని వారు తెలిపారు. అధికారిని వెంట ఎన్ఫోర్స్మెంట్ డీటీ శ్యామ్ లాల్. ఆర్ఐ ఉన్నారు.
వరి ధాన్యం అధికలోడుతో పట్టుకున్న లారీ వద్ద భాజపా నాయకుల నిరసన..
అధిక లోడుతో వరిధాన్యంతో తరలిస్తూ పట్టుబడ్డ లారీ వద్ద గురువారం సిర్పూర్ నియోజకవర్గం భాజపా నాయకుడు పాల్వాయి హరీష్ బాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ సహకారంతో మొత్తం రైస్ మిల్లర్లను సిండికేట్ గా ఏర్పరిచి రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లాలో మండపేట మెగా రైస్ మిల్లులకు తరలిస్తున్నారన్నారు. అక్కడి నుండి కాకినాడ పోర్టు నుండి విదేశాలకు ఎగుమతి చేసి పెద్ద ఎత్తున అక్రమార్చనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సంవత్సర కాలంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పీడీఎస్ దాన్యం కోణంపై భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు నిన్న రాత్రి పట్టుబడ్డ ధాన్యం ఓవర్ లోడ్ తో సాక్షాలతో సహా ఉన్నాయని అన్నారు.
మూడు కోట్ల రూపాయల పీడీఎస్ బియ్యం కుంభకోణం సూత్రధారులను అధికారులు పట్టుకోకపోగా ఒక అధికారిని బలి పశువుగా చేశారని విమర్శించారు. ఇంకోవైపు రేషన్ షాపుల్లోని బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ముక్కిన రేషన్ బియ్యాన్ని సరఫరా చేయడం వల్ల ప్రజలు ఆ బియ్యాన్ని తినలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ లారీ దారి టు అన్నదాన సత్రానిక అనే నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలెం వెంకటేష్, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, పట్టణ భాజపా అధ్యక్షుడు సిద్ధం శ్రీనివాస్, ముత్తు అశోక్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, సంతోష్, ఠాగూర్, అర్జున్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.