రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్న మంచిర్యాల విద్యార్థిని

మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి శ్రీవల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు అందుకుంది.

Update: 2023-04-10 16:54 GMT

దిశ, మంచిర్యాల టౌన్: మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి శ్రీవల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు అందుకుంది. వినూత్నమై రీతిలో సైన్స్ టైటిల్ మోడల్ సాధారణ రుతుక్రమం పరికరాన్ని సాయి శ్రీవల్లి కనిపెట్టింది. ఏప్రిల్ 10 నుంచి 23 వరకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (FINE)-2023లో భాగంగా సాయి శ్రీవల్లి తన పరికరాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించింది.

ఈ సందర్భంగా సైన్స్ టైటిల్ మోడల్ సాధారణ రుతుక్రమం పరికరం గురించి రాష్ట్రపతి ముర్ముకి వివరించింది. బహిష్టు సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను నివారించే లక్ష్యంతో పరికరాన్ని రూపొందించినట్లు రాష్ట్రపతికి ముర్ముకి వివరించింది. శ్రీవల్లి చేసిన ప్రదర్శన కు ముగ్ధురాలైన రాష్ట్రపతి ముర్ము విద్యార్థినిపై ప్రశంసలు కురిపించింది. ఈ పరికరం మహిళలకు ఉపయోగకరంగా ఉందని శ్రీవల్లిని చైల్డ్ ప్రాడిజీగా అభివర్ణించింది.

అనంతరం శ్రీవల్లి మాట్లాడుతూ మార్కెట్‌లో లభించే మెన్‌స్ట్రువల్ కిట్‌ల కంటే ఈ పరికరం తక్కువ నీరు మరియు డిటర్జెంట్‌ను వినియోగిస్తుంది తెలిపింది. దీనిని తీసుకువెళ్లడం మరియు పొడి చేయడం కూడా సులభం అని వివరించింది. ఇటీవల జరిగిన 9వ జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ మరియు ప్రాజెక్ట్ కాంపిటీషన్‌లో అగ్రస్థానంలో నిలిచి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నుంచి కూడా సాయి శ్రీవల్లి అవార్డును గెలుచుకుంది.

Tags:    

Similar News