Ponguleti Srinivasa Reddy : BRSలో అనుచరుల చేరిక.. పొంగులేటి రియాక్షన్ ఇదే!

బీఆర్ఎస్‌లోకి తన అనుచరులు తిరిగి చేరడంపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-08-19 13:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌లోకి తన అనుచరులు తిరిగి చేరడంపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారని వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను తమిరి కొట్టేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయాల్లో కేసీఆర్ ఎలాంటి పావులు కదుపుతారో అందరికీ తెలుసని.. తన ప్రత్యర్థుల శిబిరంలో ఏదో ఒక రకమైన అలజడి సృష్టించాలనే ఎత్తుగడతో కేసీఆర్ వ్యవహరిస్తుంటారని అన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ విషయంలోనూ అదే ధోరణి అవలంభిస్తున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు కాబట్టే కల్వకుంట్ల కుటుంబం మాటకు ముందు వెనక కాంగ్రెస్ జపం చేస్తోందని దుయ్యబట్టారు. ఎవరు ఎన్ని పావులు కదిపినా అంతిమంగా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారనేదే ముఖ్యం అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ట్రాప్‌లో లేరనే సంగతి స్పష్టం అవుతోందన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..