Addanki Dayakar: కేసీఆర్, కేటీఆర్ కోసం కవిత బలి: అద్దంకి దయాకర్

కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నష్టపోతే బీజేపీ సక్సెస్ అయిందని అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-27 10:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్, కేటీఆర్ కోసం కవిత బలిపశువు అయ్యారని, కవితను ఎరగా వేసి బీఆర్ఎస్ ను లొంగదీసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందని టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఓ టీవీ చానల్ తో మాట్లాడిన అద్దంకి దయాకర్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎపిసోడ్ ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. ఈ కేసును తమకు రాజకీయ లబ్ధిగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ కవితను సీరియస్ ముద్దాయిగా చేశారని అయితే కవిత అరెస్ట్ కాకపోవడంతో రాజకీయంగా బీఆర్ఎస్ కు నష్టం వచ్చిందన్నారు. ఎంపీ ఎన్నికల సమయానికి అరెస్ట్ చేసినా ఆ ప్రయోజనం బీజేపీకి దక్కిందన్నారు. బీజేపీ ప్లాన్ ప్రకారం రాజకీయంగా బలపడుతూ బీఆర్ఎస్ ను అణగదొక్కుతూ వెళ్లిందన్నారు.

సీబీఐ, ఈడీ బీజేపీ చేతిలో అస్త్రాలు అని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పాత్రను అందరూ విస్మరిస్తున్నారన్నారు. సౌత్ గ్రూప్ డీల్ చేయడం వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనేది కేసు. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం, కేబినెట్ పాత్ర ఉంది. సీఎం, కేబినెట్ బాధ్యుడిగా కేజ్రివాల్ సిసోడియాజైలుకు వెళ్లారు. మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎటుపోయారని ప్రశ్నించారు. ఈ కేసులో లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను అమిత్ షా కాపాడుతున్నారని, సాక్షిగా ఉన్న కవిత ముద్దాయిగా ఎందుకు మారారు? అని నిలదీశారు. ఈ రెండు మూడు నెలల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తా? విలీనమా? అనేది తేలిపోతుందని, అయితే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ విలీనం జరగదన్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కోవడం బీజేపీ ఒక్క పార్టీతో సాధ్యం కాదని ఇందు కోసం బీఆర్ఎస్ తో బీజేపీ గేమ్ ఆడి చివరకు టేక్ ఓవర్ చేస్తారని ఆరోపించారు. ఒక ఆడబిడ్డ సారా కేసులో ఇరుక్కేవడం ఏందని సమాజంలో పెద్దఎత్తున చర్చ జరిగిందన్నారు. కేజ్రీవాల్ ప్రస్తుతం ఇండియా కూటమితో ఉన్నారు. బీజేపీ టార్గెట్ ఢిల్లీ ఎన్నికలని అందులో భాగంగా కేజ్రీవాల్ అంశాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకోబోతున్నదన్నారు.


Similar News