Addanki Dayakar: తెలంగాణ సమాజం సిగ్గు పడుతోంది.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు
జన్వాడ (Janwada)లోని కేటీఆర్ (KTR) బావమరిది ఫామ్‌హౌస్(Farm House)లో రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయా (Telangana Politics)ల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ (Janwada)లోని కేటీఆర్ (KTR) బావమరిది ఫామ్‌హౌస్(Farm House)లో రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయా (Telangana Politics)ల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఇప్పటికే పలు పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో స్సందించారు. తాజాగా, రేవ్ పార్టీ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఘాటుగా స్పందించారు. కేటీఆర్ (KTR) బావమరిది ఫామ్‌హౌస్‌లో అసాంఘీక కార్యక్రమాలు చూస్తే.. మొత్తం తెలంగాణ సమాజం సిగ్గు పడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) డగ్స్ ఫ్రీ స్టేట్ (Drug Free State)గా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఓ మాజీ మంత్రిగా ఉన్న సొంత బావమరిది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీలు జరగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అయితే, పోలీసుల రైడ్ జరిగే కంటే ముందే రేవ్ పార్టీ నుంచి మరో 20 మంది వరకు వెళ్లిపోయారనే సమాచారం తమ వద్ద ఉందని అద్దంకి దయాకర్ అన్నారు.