కాస్టింగ్ కౌచ్ పై నటి సమంత సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటి సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-30 17:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ చాలా బాగా పని చేసిందని ప్రశంసించారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, పలు కీలక సూచనలు చేసిన హేమ కమిషన్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కమిషన్ ఏర్పాటు కావడానికి కేరళ వర్కింగ్ విమెన్ కలెక్టివ్ చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. టాలీవుడ్ లో మహిళా నటీమణులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు సమంత. మరి జస్టిస్ హేమ కమిషన్ లాగా టాలీవుడ్ లో కూడా కమిషన్ వేస్తారా లేదా.. సీఎం గాని, ప్రభుత్వ అధికారులు గాని ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.   


Similar News