BRS బెదిరింపులకు తట్టుకోలేక ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన వెన్నెల కిషోర్ రెడ్డి
బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధింపులు భరించలేక ట్విట్టర్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు వెన్నెల కిశోర్ రెడ్డి.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధింపులు భరించలేక ట్విట్టర్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు సోషల్ మీడియా యాక్టివిస్ట్, కాంగ్రెస్ సపోర్టర్ వెన్నెల కిశోర్ రెడ్డి. ఎవరినీ నొప్పించకుండా స్వచ్ఛందంగా పోస్టులు పెడుతున్నా తనపై కక్ష కట్టిన గులాబీ పార్టీ నేతలు బెదిరిపులకు దిగుతున్నారని కిషోర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఫేమస్ ఎక్స్ ఖాతాకు చెందిన అశోక్ రెడ్డి అనే వ్యక్తి తనను 3 నెలల నుంచి టార్చర్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినీ దూషించకుండా పోస్ట్‌లు పెడుతున్న తనపై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘Good Bye to Twitter ఇవేం బెదిరింపులు. ఇదేం భాషా? నేను స్వచ్ఛందంగా ట్విట్టర్‌లో కాంగ్రెస్ పార్టీ కోసం బూతులు లేకుండా పోస్ట్‌లు వేస్తే కూడా తట్టుకోలేకుండా నాపై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడటం దారుణం. తెలుగు స్క్రైబ్, నల్ల బాలు, ఫసక్, ఉత్తమ్ వంటి వారు సీఎం గారిపై దారుణమైన ట్వీట్స్ వేస్తే మీకు ఓకే. నేను అసలు ఎక్కడ ఎవరిని నొప్పించకుండ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే నాపై ఎందుకు ఇంత కక్ష ??? చిన్న కుటుంబం, చిన్న జీవితం నాకు ఈ బెదిరింపుల రాజకీయం వద్దు. BRS అధికారం ఉన్నపుడు అదే బెదిరింపులు, దారుణాలు అధికారం పోయాక కూడా అంతే’’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ ట్రయిల్ రన్.
— Telugu Desam Party (@JaiTDP) November 8, 2024
రేపు సీ ప్లేన్ ను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు గారు. #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/pzrw2F0TFQ