సమతామూర్తిని దర్శించుకున్న నటుడు సోనూసూద్
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల్లో చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో భారీ సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల్లో చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో భారీ సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే. ఈ భారీ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. శనివారం ఈ సమతామూర్తి విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు సోనూసూద్ దర్శించుకున్నారు. ఒక్కొక్కటిగా 108 దివ్యదేశాలను సందర్శించారు.
కాగా, రామానుజాచార్యుడి జీవితపు 120 సంవత్సరాలను ఇది పురస్కరించుకుంటుంది. తామర పువ్వుపై కూర్చున్న రామానుజాచార్యుల విగ్రహం 5 లోహాలతో తయారు చేశారు. ఈ సమతా మూర్తి మహా విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రామానుజాచార్యుల విగ్రహం చుట్టూ నల్ల రాతితో చెక్కబడిన 108 చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిని దివ్యదేశం అంటారు. ఇది బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల తరహాలో రూపొందించారు.