వీడియోలు తీసినట్టు ఆధారాలు లేవు: ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ ఘటనపై ఏసీబీ శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు..
దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ(Medical CMR College)లో విద్యార్థునుల(Students) ఆందోళన కొనసాగుతోంది. హాస్టల్ బాత్ రూమ్‌లో రహస్యంగా వీడియో తీశారంటూ ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. అనుమానితుల సెల్ ఫోన్లలో వీడియోలు రికార్డులు చేసినట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. 11 ఫోన్లను సీజ్ చేశామని, కానీ అభ్యంతరకర వీడియోలేమీ లేవని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని, తమకు అందిన ఫిర్యాదు మేరకు మెస్‌లో పని చేసే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హాస్టల్ బాత్ రూమ్ కిటికీపై ఉన్న ముద్రలను ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ సేకరించిందన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని, విద్యార్థినులు ఆందోళన విరమించాలని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.