Viral Video : లైకుల కోసం పిచ్చి చేష్టలు! ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ యూట్యూబర్ హల్‌చల్
ఈ మధ్యకాలంలో యువత పాపులర్ అవ్వడం, లైకుల కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. వాళ్లు చేసే పనులతో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్యకాలంలో యువత పాపులర్ అవ్వడం, లైకుల కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. వాళ్లు చేసే పనులతో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ యువకుడు రోడ్డుపై ట్రాఫిక్‌లో చేసిన హంగామా నెట్టింట వైరల్‌గా మారింది. హైదరాబాద్ - కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ యూట్యూబర్ & ఇన్‌స్టాగ్రామర్ రోడ్లపై ట్రాఫిక్ మధ్యలో డబ్బులు విసురుతూ రీల్స్ చేశాడు. ట్రాఫిక్‌కు అంతరాయాన్ని కలిగించేలా వీడియోలు తీశాడు. దీంతో అక్కడే ఉన్న కొంత మంది జనాలు ఆ డబ్బులు తీసుకోడానికి గుమిగూడారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారండంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఇలా స్టంట్స్ చేసిన యూట్యూబర్ & ఇన్‌స్టాగ్రామర్ పవర్ హర్ష అలియాస్ మహదేవ్ మీద చర్యలు తీసుకోవాలని నెటిజన్లు హైదరాబాద్ పోలీసులను కోరుతున్నారు. బెట్టింగ్ యాప్‌లాంటి వాటిని ప్రమోట్ చేసి సందపాదించిన డబ్బులను అతను గాల్లో ఎగురవేస్తున్నాడని కొంత మంది నెటిజన్స్ ఎక్స్ వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని ఇతనిపై చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ పోలీసులను కోరారు. ఎర్రగడ్డ ఖాళీగానే ఉంది తీసుకపోయి అందులో వేస్తే సరి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.