Breaking: ప్రాణం తీసిన పంటి వైద్యం.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.

Update: 2024-02-19 11:08 GMT

దిశ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పంటి వైద్యం కోసం వెళ్లిన ప్రాణాలను కోల్పోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీనారాయణ (28) అనే వ్యక్తి పంటి సమస్యతో జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 37 లోని FMS ఇంటర్నేషనల్ డెంటల్ క్లీనిక్ కి వెళ్లారు. ఇక ఆసుపత్రికి వెళ్లిన లక్ష్మీనారాయకు వైద్యులు వైద్యం చేయడం ప్రారంభించారు.

అయితే లక్ష్మీనారాయణ చికిత్స పొందుతూ మరణించారు. ఇక చికిత్సపొందుతూ అకస్మాత్తుగా చనిపోయారని మృతుని కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లక్ష్మీనారాయన మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

చికిత్స చేసే సమయంలో అనస్తీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్లనే తమ కొడుకు చనిపోయారని మృతుని తండ్రి ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కోడు చనిపోయారని మృతుని తండ్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మృతునికి విహాహం నిశ్చయమైంది.

రెండు రోజుల క్రితం నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ అయినా ఒక రోజు తరువాత తన పళ్లలో చిన్న సందు ఉందని దాన్ని సెట్ చేయించుకోవడానికి ఆ యువకుడు FMS ఇంటర్నేషనల్ డెంటల్ క్లీనిక్ కి వెళ్లారు. అక్కడ వైద్యులు తనకి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఓ టాబ్లెట్ కూడా ఇచ్చారు. ఆ టాబ్లెట్ వేసుకున్న వెంటనే ఆ వ్యక్తి వాంతులు చేసుకుని కుప్పకూలి పోయాడు.

అంతే క్షణాల్లో పురాణాలను కోల్పోయారు. రెండు రోజుల ముందు ఎంతో ఆనందంగా నిశ్చితార్ధం చేసుకుని.. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్న యువకుడి అకాలమరణం ఆ కుటుంబసభ్యులను శోఖ సంద్రంలో ముంచింది. 

Tags:    

Similar News