ప్రగతి భవన్‌లో ఒక్కసారిగా మారిన సీన్.. KCR పేరుపై బురద చల్లి కవరింగ్..!
జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ ప్రారంభమైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు తరలివచ్చారు. అయితే ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రగతి భవన్‌ను 2016లో ప్రారంభోత్సవం చేశారు. దానికి సంబంధించిన శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరును బురదతో కప్పివేశారు. ప్రజా దర్బార్ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు ఆ శిలాపలకం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా నెట్టింట్లో వాటికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. మరోవైపు ప్రగతి భవన్‌లోకి పదేళ్లుగా సమాన్యులు ఎంట్రీ ఉండకపోవడం.. నేడు ప్రజా దర్బార్ పేరుతో సామాన్యులకు సైతం ఎంట్రీ ఉండడంతో ప్రగతి భవన్ వద్ద వచ్చిన ప్రతి ఒక్కరు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే కేసీఆర్ పేరును కనిపించకుండా బురదతో కప్పివేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.