హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడిపై కోపంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడిపై
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడిపై కోపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ గూగుల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా నెల్లూరుకు చెందిన మనోజ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మనోజ్ మియాపూర్‌లో బిజినెస్ చేస్తోన్నాడు. ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. మనోజ్‌పై ఖుష్బు విపరీతమైన ప్రేమను పెంచుకుంది. అయితే మంగళవారం ఉదయం కలవాలని ఉందని మనోజ్‌ను ఖుష్బు శర్మ పిలిచింది.
అయితే ఎంత వెయిట్ చేసినా రాకపోవడంతో ఖుష్బు కారులో మియాపూర్ బయల్దేరగా.. మార్గం మధ్యలో వసంత్‌నగర్ వద్ద ఆగి మళ్లీ మనోజ్‌కు ఫోన్ చేసింది. నువ్వు రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో మనోజ్ హుటాహుటిన బయల్దేరగా.. అతడు వచ్చేసరికి ఘటనా స్థలంలో ఖుష్బు పడిపోయి కనిపించింది. వెంటే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు విడిచింది.