నిజంగా ఈ ఆర్టీసీ కండక్టర్ మనసు ‘బంగారం’
జగిత్యాలలో ఓ మహిళా ప్రయాణికురాలు రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మరిచి వెళ్లిపోయింది. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి గొప్ప మనసు చాటుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: జగిత్యాలలో ఓ మహిళా ప్రయాణికురాలు రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మరిచి వెళ్లిపోయింది. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి గొప్ప మనసు చాటుకుంది. అయితే నిన్న రాత్రి పెద్దపల్లి నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు ప్రయాణించింది. తన స్టాప్ రాగానే మహిళ బస్సులోనే బ్యాగ్ మరిచి దిగిపోయింది. అనంతరం బ్యాగును గమనించిన కండక్టర్.. బ్యాగులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ప్రయాణికురాలికి సమాచారం ఇచ్చింది. జగిత్యాల డిపో మేనేజర్ సమక్షంలో బంగారు ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ను సంబంధిత ప్రయాణికురాలికి అప్పగించారు. కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. నిజాయితీగా తన బంగారు ఆభరణాలను అందించిన కండక్టర్ వాణికి, డ్రైవర్ తిరుపతికి ప్రయాణికురాలు భవాని ధన్యవాదాలు తెలిపారు.