Rare Incident: భర్తను ఇష్టపడిందని.. వేరే యువతితో పెళ్లి చేసిన భార్య
భర్త వేరే మహిళను చూస్తేనే ఒప్పుకోని మహిళలున్న ఈ రోజుల్లో ఒక మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: భర్త వేరే మహిళను చూస్తేనే ఒప్పుకోని మహిళలున్న ఈ రోజుల్లో ఒక మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేసింది. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లికి చెందిన దాసరి సురేష్, సరితలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలోనే తన భర్త సురేష్ ను అతని మేనమామ కుమార్తె సంధ్య ఇష్టపడింది. దీంతో భార్య వారిద్దరికీ బంధువుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసింది. దీనిపై ఆ మహిళ మాట్లాడుతూ.. మాకసిక వికలాంగురాలైన సంధ్య తన భర్తను ఇష్టపడిందని, దీంతో మానవతా దృక్పథంతో వారిద్దరికీ పెళ్లి చేశానని, మానసిక వికలాంగురాలైన ఆమెను జాగ్రత్తగా చూసుకునేందుకే పెళ్లి చేసి తన ఇంటికి తెచ్చుకుంటున్నానని ఆ మహిళ వెల్లడించింది.