వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్​ నమోదు

వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్​రెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్​ప్రకారం కేసులు నమోదు చేశారు.

Update: 2023-02-10 14:09 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్​రెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్​ప్రకారం కేసులు నమోదు చేశారు. అతనితోపాటు వైశాలి ఇంటిపై దాడి చేసినట్లు నేరారోపణలు ఎదుర్కొంటున్న మరో 40 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. మన్నెగూడ నివాసి, బీడీఎస్​ విద్యార్థిని అయిన వైశాలిని కొంతకాలం క్రితం నవీన్​రెడ్డి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ప్రేమించానంటూ వెంటపడి.. వేధించి తన దారికి రావటం లేదని స్నేహితులతో కలిసి నవీన్​రెడ్డి ఈ నేరానికి పాల్పడ్డాడు.

ఆ సమయంలోనే నవీన్​రెడ్డి స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆమె ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. అప్పట్లో ఈ ఉదంతం హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. పరారీలో ఉన్న నవీన్​రెడ్డిని పోలీసులు గోవాలో అరెస్ట్​చేసి నగరానికి తీసుకొచ్చారు. ఆదిభట్ల పోలీసులు అతనిపై 5 కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. కాగా, రాచకొండ కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​ ఆదేశాల మేరకు తాజాగా నవీన్​రెడ్డి మీద పీడీ యాక్ట్​ప్రకారం కేసులు పెట్టారు.

.Also Read..

రేవంత్, బండి సంజయ్‌ వ్యాఖ్యలపై అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్

Tags:    

Similar News