Ganesh Laddu : గణపతి బప్పా మోరియా.. ‘తాజా’ లడ్డూ చోరియా! లడ్డూల దొంగలొచ్చారు జాగ్రత్త!

రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది.

Update: 2024-09-08 11:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. నిన్న మొదటి రోజు బొజ్జ గణపయ్య వివిధ రూపాల్లో కొలువుదీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు విద్యుత్ కాంతులు, వివిధ రూపాల సెట్టింగులతో గణేష్ మండపాలు కళకళలాడుతున్నాయి. ఇక గణేశుని ఎంత ప్రాధాన్యత ఉందో వినాయకుడి చేతిలో లడ్డూకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు.. నిమజ్జనం రోజు లడ్డూ వేలం వేస్తారు. లడ్డూను దక్కించుకున్న వారికి అంతా మంచి జరుగుతుందని నమ్మకంగా భావిస్తారు. అయితే కొంత మంది ఈ లడ్డూలను కూడా సైలెంట్‌గా ఎవరూ లేని సమయంలో ఎత్తుకెళ్లిపోతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వినాయకుడి చేతిలో లడ్డూను దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

హైదరాబాద్- బాచుపల్లి పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మండపంలోని గణపతి చేతిలో ఉన్న లడ్డూను చోరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లడ్డూ దొంగలు వచ్చారు జాగ్రత్త అంటూ నెటిజన్లు మండపాల నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు. గణపతి చేతిలోని లడ్డూను దొంగిలించి తింటే మంచి జరుగుతదని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతుంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గతపతి చేతిలో ఉన్న లడ్డూలు దొంగతనానికి గురవడం కొన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. గణపతి బప్పా మోరియా.. ‘తాజా’ లడ్డూ చోరియా అంటూ దొంగతనంపై వారి వారి భాషాల్లో స్లొగన్స్ కూడా ఉన్నాయి. 


Similar News