Arrested: మరోసారి ప్రొడ్యూసర్ శివరామకృష్ణ అరెస్ట్
ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలను కాజేయాలని చూసినందుకు నాలుగు రోజుల క్రితం టాలీవుడ్ ప్రొడ్యూసర్ శివరామకృష్ణ (Sivaramakrishna)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలను కాజేయాలని చూసినందుకు నాలుగు రోజుల క్రితం టాలీవుడ్ ప్రొడ్యూసర్ శివరామకృష్ణ (Sivaramakrishna)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ రోజు అతని ఆరోగ్యం బాగోలేక పోవడంతో వెంటనే కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మరోసారి ప్రొడ్యూసర్ శివరామకృష్ణను అరెస్ట్(arrest) చేశారు. అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన శివరామకృష్ణ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు బెయిల్ రద్దు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. రాయదుర్గం(Rayadurgam)లో దాదాపు 84 ఎకరాల భూమిని సొంతం చేసుకోవాలని చూసిన ఆయన.. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్నారు.
అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్(Department of Archaeology) సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించారు. అనంతరం సదరు 84 ఎకరాల ల్యాండ్ తనదేనంటూ శివరామకృష్ణ(Sivaramakrishna) క్లయిమ్ చేశాడు. అనంతరం ఆ భూమిలో బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో పాగా వేశాడు. కాగా ఈ ఇష్యూపై 2003లో అప్పటి ప్రభుత్వం నకిలీ పత్రాలపై కోర్టులో కేసు వేసింది. నాటి నుంచి ఈ కేసు కొనసాగుతుండగా.. సదరు ప్రభుత్వ భూమి కోసం హైకోర్టు(High Court) నుండి సుప్రీంకోర్టు(Supreme Court) వరకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేసింది. పూర్తి వాదనలు, సాక్షాదారాలు పరిశీలించిన తర్వాత.. శివరామకృష్ణ కోర్టుకు సమర్పించినవి నకిలీ పత్రాలు అని సుప్రీం కోర్టు తేల్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ నెల 22న శివరామకృష్ణ తో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేసుకొని శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగం గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.