Telangana కాంగ్రెస్‌లోకి కీలక నేత?

కర్ణాటకలో ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. అదే ఫలితాన్ని ఇక్కడ కూడా రాబట్టడం ఖాయమని భావిస్తున్న నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.

Update: 2023-06-23 03:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. అదే ఫలితాన్ని ఇక్కడ కూడా రాబట్టడం ఖాయమని భావిస్తున్న నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరికలు సైతం పెరుగుతున్నాయి. తాజాగా.. మరో కీలక నేత కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి హస్తం తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా నిన్న(జూన్ 22) తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన ‘దశాబ్ది దగా’ నిరసనల్లో ఆయన పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 అంతేగాక, ఇటీవల ఆయన బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శలు చేశారు. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటున్నదని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడంలో బీజేపీ విఫలమైందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్‌ల‌ మధ్య అవగాహన ఉన్నదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందన్నారు. అయితే, కాంగ్రెస్‌లో చేరికపై ఆయన అధికారింగా ప్రకటించాల్సి ఉన్నది.

Also Read: 

కాంగ్రెస్‌లో విలీనం తర్వాత YS షర్మిలకు రాజ్యసభ!

Tags:    

Similar News