Rave Party: రేవ్ పార్టీలో షాకింగ్ విషయాలు.. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్! 86 మందికి పాజిటివ్..

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-05-23 07:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ టెస్టులో మొత్తం 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించగా.. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నటి హేమకు కూడా పాజిటీవ్‌గా నిర్ధరాణ అయినట్లు సమాచారం.

అయితే ఈ కేసులో హేమను బాధితురాలిగా పరిగణించే అవకాశం ఉన్నట్లు, హేమను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా నటి హేమ మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని, త్వరలోనే అన్ని విషయాలను బయటపెడతానని ఓ మీడియాతో నటి హేమ తెలిపింది. కాగా, ఈ రేవ్ పార్టీ లో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేవ్ పార్టీలో పలువురు నటీనటులు పాల్గొన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో కేసుపై పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..