కవితను కలిసేందుకు వెళ్లని భర్త.. ఈడీ ఆఫీస్ నుండి వెళ్లిపోయిన KTR, హరీష్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెండవ రోజు ఈడీ కస్టడీ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ దర్యా్ప్తు అధికారులు కవితపై ప్రశ్నల వర్షం

Update: 2024-03-18 14:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెండవ రోజు ఈడీ కస్టడీ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ దర్యా్ప్తు అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కస్టడీ ముగిసిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు ఈడీ కవితకు అనుమతి ఇచ్చింది. ఈ విజిటింగ్ అవర్‌లో కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈడీ కార్యాలయంలో కలిశారు. దాదాపు గంట పాటు కేటీఆర్, హరీష్ రావు కవితతో చర్చించారు. విజిటింగ్ అవర్ ముగియడంతో కేటీఆర్, హరీష్ రావు ఈడీ కార్యాలయం నుండి తిరిగి వెళ్లిపోయారు.

కవితతో ములాఖత్ అయ్యేందుకు ఢిల్లీలోనే ఉన్న ఆమె భర్త అనిల్ కుమార్ వెళ్లకపోవడం గమనార్హం. ఆదివారం విజిటింగ్ అవర్‌లో కేటీఆర్, హరీష్ రావుతో కలిసి వెళ్లి కవితను కలిసిన ఆమె భర్త ఇవాళ మాత్రం వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసినప్పటికీ.. అనిల్ కుమార్ ఈడీ దర్యాప్తుకు సైతం డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 15న అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. కోర్టు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించడంతో ఆమె ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు.

Tags:    

Similar News