Cockroach Dosa : కస్టమర్ షాక్.. దోశ తింటుంటే ప్రత్యక్షమైన బొద్దింక!
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ పలు రెస్టారెంట్లు, హోటళ్లలో మాత్రం దారుణ పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ పలు రెస్టారెంట్లు, హోటళ్లలో మాత్రం దారుణ పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్‌లో రాఘవేంద్ర కుమార్ అనే ఓ వ్యక్తి దోశ ఆర్డర్ చేసి, తింటుండగా బొద్దింక రావడంతో షాక్ అయ్యాడు.
బొద్దింక రావడంపై యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పటికీ నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దోశలో బొద్దింక వచ్చిన ఫోటోలు వైరల్‌గా మారాయి. బయట ఫుడ్ తినవద్దని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో తినాల్సి వస్తే ఆపిల్ పండ్లు తినాలని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.