IT Raids: దాడులకు పక్కా స్కెచ్! అమ్మకానికి భూమి అంటూ Malla Reddy ఇంట్లోకి..
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడి చేసే ముందు పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.
దిశ, మేడ్చల్: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడి చేసే ముందు పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. రెండు రోజుల క్రితమే మల్లారెడ్డిపై దాడులకు స్కెచ్ వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మల్లారెడ్డి ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు భూములు ఉన్నాయి డబ్బులు అవసరం ఉంది అంటూ బేరానికి దిగారు. తక్కువ ధరకైనా ఇస్తాం బ్లాక్లో డబ్బు ఇచ్చిన పర్వాలేదు అంటూ బుకాయించారు. ఐటీ అధికారులు మల్లారెడ్డికి అనుమానం రాకుండా ఆయనకు తెలిసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ని తమ వెంట తీసుకెళ్లారు. నేను ఇప్పుడు భూములు ఏమి కొనడం లేదు అని మంత్రి మల్లారెడ్డి బదులు ఇచ్చారు. ఆరు నెలలుగా మల్లారెడ్డి, బంధువులు, ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ల బ్యాంక్ అకౌంట్లను ఐటీ శాఖ గమనించినట్లు సమాచారం. దాడులకు ముందు మల్లారెడ్డి, కొడుకులు, అల్లుళ్లు, బంధువులకు చెందిన మొత్తం 300 బ్యాంక్ అకౌంట్లను నిశితంగా స్టడీ చేసిన ఐటీ డిపార్ట్మెంట్ పకడ్భందీగా దాడులకు పాల్పడినట్లు తెలిసింది.
Read more:
1.మల్లారెడ్డి ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం...ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాగ్వాదం..