BREAKING: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు

బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు

Update: 2024-02-05 15:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. కాగా, అంతకుముందు బాల్క సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాల్క సుమన్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లేదంటే బాల్క సుమన్‌ను మంచిర్యాలలో తిరగినివ్వమని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కాగా, కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ బాల్క సుమన్ స్పందించారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను లం.. రం.. అన్న రేవంత్ రెడ్డే పెద్ద రం.. అని అసభ్య పదజాలంతో దూషించారు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని ఉందని.. కానీ సంస్కారం అడ్డువస్తుందని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కాంగ్రస్ నేతలు.. తాజాగా బాల్క సుమన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. 

Tags:    

Similar News