బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై కేసు నమోదు అయింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ భగ్గుమంటుంది. ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బండి సంజయ్‌పై పలు పోలీసుస్టేషన్‌లలో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేసిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బండి సంజయ్‌పై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరో బీఆర్ఎస్ కార్యకర్త ఎస్ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు, బండిపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఎమ్మెల్సీ కవితపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. ఆయనకు నోటీసులు జారీ చేసింది.