పోరాటం చేస్తున్న విద్యార్థులపై కేసులా?: బండి
పోరాటం చేస్తున్న విద్యార్థులపై సీఎం కేసీఆర్ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.
దిశ, ముధోల్ : పోరాటం చేస్తున్న విద్యార్థులపై సీఎం కేసీఆర్ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నాడన్నారు. మంగళ వారం ముధోల్ తాలూకా కుభీర్ మండలం చాత గ్రామంలో పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇవాళ ఫుడ్ పాయిజన్ అవ్వడం బాధించిందన్నారు. విద్యార్థుల సమస్యలు వినే ఆలోచన కేసీఆర్‌కు లేదన్నారు. విద్యార్థులు తమ సమస్యలపై పోరాటం చేస్తే వారిని చదువుకోకుండా బెదిరిస్తూ, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలకు హాస్పిటల్‌కు తీసుకెళ్తే తాను బదనాం అయిత అని చెప్పి, వాళ్ళను తీసుకెళ్ళకుండా ప్రాణాలతో చెలగాటలాడుతున్నాడని మండిపడ్డారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే సంగతి చూస్తామని కేసీఆర్ ను హెచ్చరించారు.