బ్రేకింగ్ : లారీని ఢీ కొట్టిన బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు
ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ఏసీ బస్సు శుక్రవారం ఉదయం ఢీ కొట్టింది.
దిశ, ఆర్మూర్: ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ఏసీ బస్సు శుక్రవారం ఉదయం ఢీ కొట్టింది. ప్రైవేటు ఏసీ బస్సులో ప్రయాణిస్తున్న 38 మంది ప్రయాణికులకు, ఇద్దరు బస్సు డ్రైవర్లకు గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఏసీ బస్సు రాయచూర్ వైపు నుండి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు సమచారం. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు ఆర్మూర్ మున్సిపల్‌లోని పెర్కిట్‌లో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.
ప్రైవేట్ ఏసీ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలాన్ని ఆర్మూర్ సీఐ సురేష్ బాబు, ఎస్సై రాము, పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రోడ్డు ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై నిలిచిన ప్రైవేటు ఆర్టీసీ ఏసీ బస్సును క్రేన్ సహాయంతో ఆర్మూర్ పోలీసులు పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.